
ఓయీ పిచ్చి యాత్రికుడా
ఏమిటి నీ గమ్యం ?
ఎందుకీ విశ్రాంతి లేని జీవితం ?
చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తూ
అలసిపోతున్నావు, ఈ పరుగెందుకు,
ఏ అభిసారిక కోసం ?
అంత మధురమా ఆ కాల్పనిక కాదంబరి పిలుపు ?
ఆగు. ఆగి విను.
ఆవల ఉన్నదీ, దొరికేదీ శూన్యం
అతి, అనంత శూన్యం.
నీ స్వప్నసాకీ ఇక్కడే ఉంది
నీ ఊహామధురవాణి కూడా ఇక్కడే…
నిలబడు. నిలబడి నిండుగా నిశ్వసించు
నీవాశించే అమృతం ఇక్కడే ఉంది
ఈ కిందందజేసిన లింకును క్లిక్కుము
ఈ తమస్సంతమవునవలీలగా
నీ తపస్సు సఫలమవునతిశ్రీఘ్రముగా
శ్రీమత్తమృతోమాయ నమః
https://www.amrutdistilleries.com/
[Note: This article was totally unsolicited, either by Amrut Distilleries or anyone else]